పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన ‘లైగర్’ మూవీ.. విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ మొదటి షో నుండి ఫ్లాప్ టాక్‌ను తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. నెక్ట్స్ డే నుండి భారీగా కలెక్షన్స్ డ్రాప్ అయిపోయాయి. దాంతో మేకర్స్ పై లైగర్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. పూరి జగన్నాధ్, ఛార్మీలకు భారీగా నష్టాలు వచ్చాయి. లైగర్ బ్రేక్ ఈవెన్ అవాలంటే 85 కోట్లకు పైగా రాబట్టాల్సి ఉంది. కానీ ఫైనల్‌గా 30 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ చిత్రానికి 55 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అంటున్నారు. గతంలో లైగర్ నష్టాల గురించి ఎన్ని వార్తలొచ్చినప్పటికీ.. ఇదే ఫైనల్ ఫిగర్ అని అంటున్నారు.
ఇకపోతే ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకొచ్చిన లైగర్.. ఇప్పుడు ఓటిటి టైం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అన్ని భాషలకు సంబంధించిన ఓటిటి రైట్స్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ రేటుకు దక్కించుకుంది. దాంతో ముందుగా సెప్టెంబర్ 25న లైగర్ ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కాస్త ముందుగానే ఓటిటిలోకి రాబోతోందని తెలుస్తోంది. సెప్టెంబర్ 22న లైగర్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని వినిపిస్తోంది. ఇదే నిజమైతే నెల రోజుల లోపే.. మరికొన్ని గంటల్లో లైగర్ ఓటిటిలోకి రాబోతోందని చెప్పొచ్చు. ప్రస్తుతం లైగర్ ఓటిటి టైం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏదేమైనా లైగర్ మూవీ ఫ్లాప్ అయి కూడా ట్రెండింగ్‌లో నిలుస్తుందనే ఉందనే చెప్పాలి.