»Triptii Dimri Says There Was No Awkwardness With Rashmika Mandanna
Rashmika చాలా కూల్, సెట్లో ఫ్రెండ్లీగా ఉండేది: తృప్తి డిమ్రీ
యానిమల్ మూవీలో నటించిన మరో నటి తృప్తి డిమ్రి రష్మికతో కలిసి నటించడం, రణబీర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంపై మాట్లాడారు. రష్మిక చాలా కూల్ అని.. తనతో ఫ్రెండ్లీగా ఉండేదని తెలిపారు.
Triptii Dimri says there was no awkwardness with Rashmika Mandanna
Triptii Dimri: యానిమల్ మూవీ దుమ్ము దులిపేస్తోంది. వసూళ్ల పరంగా టాప్ గేర్‌లో దూసుకెళుతోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు కలెక్ట్ చేసింది. మూవీలో రణబీర్ కపూర్ రష్మిక మందన్నా, తృప్తి నటన మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ఆ సినిమాలో నటించిన తృప్తి డిమ్రి (Triptii Dimri) షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. రష్మిక చాలా కూల్ అని.. తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టంచేసింది.
నేషనల్ క్రష్ అంటే రష్మిక.. యానిమల్ మూవీ తర్వాత ఇప్పుడు నేషనల్ క్రష్ అని తృప్తి డిమ్రి (Triptii Dimri) అంటున్నారు. రష్మిక సెట్లో సరదాగా ఉండేవారు. తనకు సెట్లో మంచి అనుభూతిని కలిగించారు. ఏ సమయంలో ఇబ్బంది పడలేదు. మూవీలో ఇద్దరూ హీరోయిన్లు ఉంటే ఆ ఎనర్జీ వేరు అని చెబుతోంది. రష్మిక చాలా తెలివైన అమ్మాయి.. తన వద్దకు వచ్చేదని, హగ్ చేసుకునేదని తెలిపింది. తనను ఇష్టపడేది అని.. అందుకే తన పక్కన కూడా కూర్చొండేదని తెలిపింది. తాను ఏమైనా ఇబ్బంది పడుతున్నా అని చూసేదని నవ్వుతూ చెప్పింది. అంతే తప్ప తమ మధ్య విభేదాలు ఏమీ లేవని.. ఈగో రాలేదని చెప్పింది. రష్మిక తనకు సెట్లో స్వాగతం పలికిందని.. వస్తోన్న పుకార్లను కొట్టిపడేసింది.
రణబీర్‌తో కలిసి నటించడంపై స్పందిస్తూ.. అతను ఎవరితో కలిసి నటిస్తున్నారో చూసి.. ఆచితూచి మెలగుతాడని తెలిపింది. నిజంగా రణబీర్ గ్రేట్ స్టార్ అని ప్రశంసలు గుప్పించింది. యానిమల్ షూటింగ్ జరిగిన రోజులు చాలా ఎంజాయ్ చేశామని, సెట్లో అంతా సరదాగా ఉండేవారని తెలిపింది. యానిమల్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. కలెక్షన్లలో రూ.వెయ్యి కోట్ల వైపు దూసుకెళుతోంది.