నిజమే.. స్కంద(skanda) సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సినిమా థియేటర్లో మాస్ జాతర చేయించినా.. టాక్ మాత్రం డివైడ్ దగ్గరే ఆగిపోయింది. కానీ వసూళ్లు మాత్రం షాకింగ్‌గా ఉన్నాయి. మరి రామ్‌కు మాసివ్ హిట్ పడినట్టేనా? ఇప్పుడు చుద్దాం.
మాస్ సినిమాలు తీయడంలో బోయపాటి శ్రీను స్టైలే వేరు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు తీయడంలో బోయపాటి తర్వాతే ఎవ్వరైనా. లేటెస్ట్ ఫిల్మ్ ‘స్కంద(skanda)’ అయితే.. థియేటర్లో మాస్ జాతర చేసేలా ఉందంటున్నారు. లాజిక్స్ పక్కన పెడితే.. రామ్ యాక్టింగ్, ఫైట్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయంటున్నారు. ఈసారి మామూలు యాక్షన్ కాదు.. బీభత్సమైన మాస్ యాక్షన్ ఎంజాయ్ చేసే వాళ్లకు స్కందతో మాస్ జాతరేనని అంటున్నారు. అఖండ తర్వాత మరోసారి బాక్సులు బద్దలు చేశాడు తమన్. మొత్తంగా స్కంద ఊరమాస్ ట్రీట్ ఇవ్వడం పక్కా అంటున్నారు. కానీ ఓవరాల్‌గా అసలు ‘స్కంద’ సినిమాలో ఏముంది. నరుకుడు తప్పా, అందుకే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఇంత వైలెన్స్‌కు జనాలు ఎలాంటి కలెక్షన్స్ ఇస్తారా? అని అనుకున్నారు.
కానీ ఫస్ట్ డే వసూళ్లతో షాక్ ఇచ్చింది స్కంద. బోయపాటి గురించి జనాలకు తెలుసు కాబట్టి.. లాజిక్స్ పక్కకు పెట్టి స్కంద సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో డే వన్ స్కంద వసూళ్లు అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.8 కోట్లకు పైగా షేర్, రూ.13 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక వరల్డ్ వైడ్‌గా రూ.10 కోట్లకు పైగా షేర్, రూ.18 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.46 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న స్కంద.. రూ.47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ అయింది. డే వన్ రూ.10 కోట్లు వచ్చాయి అంటే.. మరో రూ.37 కోట్ల కోట్లు రాబడితేనే స్కంద బ్లాక్ బస్టర్ అయిపోయినట్టే. ఫస్ట్ వీక్‌లోనే స్కంద బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ మరో పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ కీ రోల్ ప్లే చేశాడు.