పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఇంత పెద్ద హిట్ అవుతుందని సుకుమార్ కూడా నమ్మలేదు. బీహార్, నేపాల్‌కి ప్రింట్లు పంపిస్తుంటే నవ్వుకున్నానని అన్నాడు సుకుమార్. కానీ సినిమా రిజల్ట్ చూసి.. సెకండ్ పార్ట్‌ను నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడు. కానీ క్లైమాక్స్ లెక్క తేలడం లేదట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక రీసెంట్గా ప్రకటించిన 69 వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు అందుకొని చరిత్ర తిరగరాశాడు. అలాగే ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కూడా అవార్డు అందుకున్నాడు. దీంతో పుష్ప 2 పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టే సెకండ్ పార్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు సుక్కు. కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే ఏడాది సమయం తీసుకున్నాడు.
అయితే కథల విషయంలో ఎంతో క్లారిటీగా ఉండే సుకుమార్.. పుష్ప 2 విషయంలో మాత్రం చాలా మార్పులు చేర్పులు చేశాడట. క్లైమాక్స్ కోసం చాలా వర్షన్ రాసుకున్నాడట. అందుకే క్లైమాక్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాడట సుకుమార్. వాస్తవానికి పుష్ప ఫస్ట్ పార్ట్ వన్ క్లైమాక్స్‌ను ఊహించని విధంగా రాసుకున్నాడు సుకుమార్. హీరో, విలన్లను న్యూడ్‌గా చూపించాలని అనుకున్నాడు.
కానీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకొని అంత సాహసం చేయలేకపోయాడు. అయినా కూడా పుష్ప క్లైమాక్స్ అదిరిపోయింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్‌ను కూడా నెక్స్ట్ లెవల్ అనేలా ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఇంకా ఈ క్లైమాక్స్ ఫైనల్ అవలేదని తెలుస్తోంది. ఒకవేళ పుష్ప3 కూడా ఉంటే.. దానికి లీడ్ ఇచ్చేలా పుష్ప2 ఉండాలి. అందుకే కాబోలు.. సుకుమార్ కన్ఫ్యూజన్లో ఉన్నాడనే టాక్ నడుస్తోంది. ఇక రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నీ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే సమ్మర్లో పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.