ఫస్ట్ టైం ట్రాక్ మార్చి టైం తీసుకున్న పూరి జగన్నాథ్‌కు.. లైగర్ సినిమా భారీ దెబ్బేసింది. పూరి కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. అంతే స్థాయిలో ఘోరంగా పరాజయం పాలైంది. దాంతో పూరి పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు సినీ విమర్శకులు. అయితే లైగర్ నష్టాలు భారీగా ఉండడంతో.. ప్రస్తుతం పూరి దాన్ని భర్తీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ఛార్మి, పూరితో పాటు కరణ్ జోహార్ నిర్మాతలుగా వ్యవహరించారు. దాంతో పూరి తన రెమ్యునరేషన్‌తో పాటు కలెక్షన్లలో తన వాటాకు వచ్చిన 70 శాతం డబ్బులను వెనక్కి ఇచ్చినట్లు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ కూడా పూరినే ఫాలో అయినట్టు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ రైట్స్‌లో ఉన్న వాటాను వదులుకోవడమే కాదు.. తన పారితోషికంలో 6 కోట్ల రూపాయలను వెనక్కి ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
అయితే లైగర్ దెబ్బకు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన ఆగిపోయినట్టు తెలుస్తోంది. దాంతో పూరి ముందు మరో కొత్త కథ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. చార్మి మాత్రం ఓ విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా చార్మీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్‌గా మారింది. Chill guys! Just taking a break.. from social media.. PuriConnects will bounce back.. Bigger and Better.. అంటూ పోస్ట్ చేసింది. బిగ్ బ్రేక్ అంటే.. ఈ లెక్కన పూరి నెక్ట్స్ ప్రాజెక్ట్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పొచ్చు. అయితే ఈ బ్రేక్ ‘జెజిఎం’ సినిమాకా లేక.. నిజంగానే సోషల్ మీడియాకేనా.. అనే సందేహం రాక మానదు. ఏదేమైనా సోషల్ మీడియా నుంచి పూరి, చార్మి బ్రేక్ తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి పూరి సార్.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.