Prabhas Donates Rs.10 lakhs To Bhadrachalam Temple
Prabhas:యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త మూవీ ఆదిపురుష్ త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇందులో ప్రభాస్ శ్రీరాముడి రోల్ పోషించారు. ఈ క్రమంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి ప్రభాస్ (Prabhas) విరాళం ఇచ్చారు. ప్రభాస్ (Prabhas) ప్రతినిధులు దంతులూరి సత్యనారాయణ రాజు, వేమారెడ్డి, విక్రమ్, శ్రీనివాస రెడ్డి రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈవో రమాదేవికి అందజేశారు.
ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ మూవీ హిట్ కావాలని ఆలయంలో గల మూలవిరాట్, అనుబంధ ఆలయాల్లో ఆంజనేయ స్వామి, లక్ష్మీతాయారమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాస్ (Prabhas) అందజేసిన రూ.10 లక్షలను అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల కోసం కేటాయిస్తారట. ఈ మేరకు ఏఈవో భవానీ రామకృష్ణా రావు తెలిపారు.
రామాయణం ఆధారంగా విజువల్ వండర్ ఆదిపురుష్ తెరకెక్కింది. మూవీలో కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఓం రౌత్ డైరెక్ట్ చేయగా.. అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ మూవీపై భారీ హైప్ పెట్టుకున్నారు.