• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

ఒకేసారి 4Kలో పూరి 3 సినిమాలు రీ-రిలీజ్

దర్శకుడు పూరి జగన్నాథ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆయన తెరకెక్కించిన మూడు సినిమాలు త్వరలోనే 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ కానున్నాయి. ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘పోకిరి’ సినిమాలను మరోసారి థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు పూరి ప్రకటించాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

February 22, 2026 / 12:10 PM IST

రాజ్ తరుణ్ కోలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధం

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

February 22, 2026 / 11:42 AM IST

TVలోకి మన శంకరవరప్రసాద్ గారు’

మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మన శంకరవర ప్రసాద్‌ గారు’ OTTలోనూ అదరగొడుతోంది. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా TVలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ టీవీ ఛానల్ జీ తెలుగులో FEB 28న సాయంత్రం 5:30కి టెలికాస్ట్ కానుంది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తెరక్కించిన ఈ మూవీలో నయనతార, వెంకటేష్ కీలక పాత్రలు పోషించారు. 

February 22, 2026 / 11:13 AM IST

ఎన్టీఆర్, నీల్ మూవీ షూటింగ్ UPDATE

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. జోర్డాన్‌లో మార్చి 6 వరకు జరగాల్సిన చిత్రీకరణ, స్థానిక జూనియర్ ఆర్టిస్టుల కొరత, లాజిస్టిక్ సమస్యల వల్ల ముందుగానే ముగిసిందట. దీంతో మిగిలిన చిన్నపాటి సీన్లను HYDలోని RFCలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో పూర్తి చేయనున్నారట. FEB 25నే మేకర్స్ తిరిగి HYDకి రానున్నట్లు టాక్.

February 22, 2026 / 10:46 AM IST

బాలయ్య ‘NBK-111’లో వరలక్ష్మి శరత్ కుమార్!

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK-111’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో విలక్షణ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వరలక్ష్మి ‘సరస్వతి’ మూవీ ట్రైలర్ లాంచ్‌లో గోపీచంద్ మాట్లాడుతూ.. తన ప్రతి సినిమాలో ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉంటుందని, ఈ క్రేజీ ప్రాజెక్టులోనూ అది రిపీట్ కాబోతోందని హింట్ ఇచ్చాడు.

February 22, 2026 / 10:24 AM IST

ఉత్తమ నటి నివేదా థామస్‌

కొచ్చిలో జరిగిన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా సాగింది. ‘పుష్ప 2’ ప్రభంజనం సృష్టించి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు (అల్లు అర్జున్), ఉత్తమ దర్శకుడు (సుకుమార్) అవార్డులను గెలుచుకుంది. నివేదా థామస్ (35: చిన్నకథ కాదు) ఉత్తమ నటిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ ఉత్తమ సహాయ నటుడిగా, తేజ సజ్జా, కాజల్ అగర్వాల్ క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటీనటులుగా అవార్డులు అందుకున్నారు.

February 22, 2026 / 09:56 AM IST

సరికొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ‘పుష్ప 2’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకోవడంతో ఆయన ఖాతాలో మొత్తం 7 అవార్డులు చేరాయి. దీనితో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్న నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డును బన్నీ సమం చేశాడు. యంగ్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక నటుడిగా అల్లు అర్జున్ ఇప్పుడు టాప్‌లో నిలిచాడు.

February 22, 2026 / 09:36 AM IST

ఒకేసారి నాలుగు చిత్రాలతో విక్రమ్‌

నటుడు విక్రమ్ ఒకేసారి నాలుగు సినిమాలను ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ‘కొన్నిసార్లు నిశ్శబ్దం కూడా ఒక ప్రిపరేషనే. నేను ఆరాధించే దర్శకులతో, విభిన్నమైన కథలతో మీ ముందుకు వస్తున్నాను’ అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ ఏడాది అంతా కథల ఎంపికపైనే దృష్టి పెట్టానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపాడు. ఈ అప్‌డేట్‌తో సినీ ప్రియుల్లో ఆసక్తి పెరిగింది.

February 22, 2026 / 09:07 AM IST

రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ హాట్ కామెంట్స్

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి ఫ్రెండ్ ప్రమోద్ శెట్టి హాట్ కామెంట్ చేశాడు. ‘నాకు రష్మిక పెళ్లికి ఇన్విటేషన్ రాలేదు. వస్తే నేను తప్పకుండా వెళ్తాను. కానీ, నాకు తెలుసు.. ఆమె మమ్మల్ని పిలవదు. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు’ అని చెప్పుకొచ్చాడు.

February 22, 2026 / 08:08 AM IST

బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని అనుకోలేదు: ప్రియాంక

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను బాలీవుడ్‌ని వదిలి వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. కొన్ని కారణాల వల్ల తనకు బాలీవుడ్‌లో పరిమితమైన అవకాశాలు వచ్చాయనే భావన కలిగినట్లు తెలిపింది. అలాంటి పరిస్థితుల్లోనే హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు పేర్కొంది. ఈ రెండు పరిశ్రమలలో పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది.

February 22, 2026 / 06:22 AM IST

ఫిబ్రవరి 22: టీవీలలో సినిమాలు

స్టార్ మా: ఫిదా(8AM), మ్యాడ్-2(1PM), విరూపాక్ష(3:30PM); జీతెలుగు: శ్రీమంతుడు(9AM), అయాలాన్(12PM), కార్తికేయ-2(3PM), సంక్రాంతికి వస్తున్నాం(6PM); ఈటీవీ: అల్లుడుగారు(9:30AM); స్టార్‌మా మూవీస్: మాస్(7AM), నేనేరాజు నేనేమంత్రి(9AM), ఛత్రపతి(12PM), MS ధోనీ(3PM), KGF-1(6PM), S/O సత్యమూర్తి(9PM); జీ సినిమాలు: గీతాంజలి(7AM), ఆయ్(10AM), సరిపోదా శనివారం(12PM), ఆనందో బ్రహ్మ(6PM).

February 22, 2026 / 01:58 AM IST

అనసూయ అంటే నాకు గౌరవం ఉంది: శివాజీ

గతంలో అమ్మాయిల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నటుడు శివాజీ తాజాగా స్పందించాడు. తాను ఆ సమయంలో రెండు పదాలు వాడినందుకు మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపాడు. అలాగే, తాను అనసూయను కూడా ఏమీ అనలేదని చెప్పాడు. ఆమెతో తనకు పరిచయం కూడా తక్కువని.. ఆమె అంటే తనకు గౌరవం ఉందన్నాడు. ఈ ప్రపంచంలో మగవారు ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లను కించపరచాలని అనుకోరనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పుకొచ్చాడు.

February 22, 2026 / 12:59 AM IST

‘కిల్లర్’ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

‘గుప్పెడంత మనసు’ సీరియల్ ఫేమ్ జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘కిల్లర్’. ఈ సినిమాతో ఆమె వెండితెరపై హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. Sci-Fi థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జ్యోతి ఐదు పాత్రలలో నటిస్తుండటం విశేషం.

February 21, 2026 / 07:44 PM IST

శర్వానంద్ ‘భోగి’ నుంచి కొత్త అప్‌డేట్

దర్శకుడు సంపత్ నందితో హీరో శర్వానంద్ ‘భోగి’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

February 21, 2026 / 07:25 PM IST

రవి బస్రూర్‌కు రోలెక్స్ గిఫ్ట్‌గా ఇచ్చిన విశ్వక్

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కల్ట్’. ఈ మూవీ టీజర్‌ను ఈరోజు ఘనంగా విడుదల చేశారు. ఈ వేడుకలో సంగీత దర్శకుడు రవి బస్రూర్‌కు విశ్వక్ సేన్ ఖరీదైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రవి బస్రూర్ అందించిన అద్భుతమైన సంగీతానికి కృతజ్ఞతగా ఈ స్పెషల్ గిఫ్ట్ అందించినట్లు విశ్వక్ తెలిపాడు.

February 21, 2026 / 06:25 PM IST