Taman: ప్రతి ఒక్క డైరెక్టర్ తమ సినిమా హిట్ అవ్వాలనే అనుకుంటారు. దానికోసమే కష్టపడతారు. కానీ, మూవీ కొంచెం తేడా కొడితే చాలు ఆ హీరో ఫ్యాన్స్ డైరెక్టర్లను విపరీతంగా ట్రోల్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్లలో ఎవరైనా సరిగా మ్యూజిక్ అందించకపోతే, పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ విషయంలో మాత్రం అలా కాదు. తమన్ ని ఛాన్స్ దొరికినప్పుడల్లా విపరీతంగా ఏకిపారేస్తూ ఉంటారు. ఎంత గొప్పగా సంగీతం ఇవ్వడానికి ఆయన ప్రయత్నించినా కూడా విమర్శిస్తూనే ఉంటారు. తాజాగా కూడా ఆయన మరోసారి మహేష్ ఫ్యాన్స్ బారిన పడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
భగవంత్ కేసరి మూవీ హిట్ నేపథ్యంలో విపరీతంగా మూవీ టీమ్ ఇంటర్వ్యూలు చేస్తోంది. భగవంత్ కేసరి ప్రమోషన్ల భాగంగా దర్శకుడు బాబీ బాలయ్య టీమ్ తో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా తమన్ చెప్పిన కొన్ని విషయాలు రాంగ్ ట్రిగ్గర్ అయ్యాయి. జీవం లేని సన్నివేశాలు చనిపోయిన శవం లాంటివని, వాటిని మంచి మ్యూజిక్ ఇచ్చి లేపమంటే ఎవరి వల్లా కాదని అన్నాడు. అనిల్ రావిపూడి మంచి అవుట్ ఫుట్ తెచ్చాడు కాబట్టి తాను బెస్ట్ ఇవ్వగలిగానని, అఖండకు అలాగే జరిగిందని ఇంకో ఉదాహరణ ఇచ్చాడు. నిజానికి తమన్ తేడా వచ్చిన ఫలితాల గురించి ఏ సినిమా పేరు చెప్పలేదు.
సరిగ్గా ఇక్కడే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంట్రీ ఇచ్చారు. వాళ్లకు ముందు నుంచి సర్కారు వారి పాటకు తమన్ పని తనం మీద వీలు దొరికినప్పుడల్లా ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ని పట్టుకొని మహేష్ మూవీని మాత్రమే అలా అన్నారు అంటూ విమర్శించడం మొదలుపెట్టారు.మరి ఫ్యాన్స్ రియాక్షన్ కి తమన్ సమాధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇక, గుంటూరు కారంలో కూడా మ్యూజిక్ తేడా కొడితే మాత్రం తమన్ ని ఫ్యాన్స్ మళ్లీ ఏకిపారేయడం ఖాయం.