Annapurna Photo Studio: ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
గ్రామీణ నేపథ్యంలో సాగే కథలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అలాంటి కథతో వస్తున్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది. ‘భూమికి అందం ఊరు..ఊరుకు అందం పైరు..కొండల్లో దూకే సెలయేరు’ అంటూ ఈ సాంగ్(Song) సాగుతుంది.
‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ నుంచి లిరికల్ సాంగ్:
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా(Annapurna Photo Studio Movie)కు ప్రిన్స్ హ్యారీ మ్యూజిక్ అందించారు. శ్రీనివాస మౌళి సాహత్యం అందించారు. సాయిచరణ్ ఆ పాటను పాడారు. ఈ పాటకు సంబంధించిన విజువల్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. యశ్ రంగినేని ఈ మూవీని రూపొందిస్తున్నారు. చెందు ముద్దు ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీలో చైతన్యరావు, లావణ్య లక్ష్మీ ప్రధాన పాత్రలు పోషించారు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథాంశంతో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అన్నపూర్ణ ఫోటో స్టూడియో మూవీ(Annapurna Photo Studio Movie) విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.