Malvika nair: ఆ హీరోతో డాన్స్ చేయడం ఇష్టం.. మాళవిక నాయర్
మాళవిక నాయర్ అంటే.. గుర్తు పట్టడం కాస్త కష్టమే గానీ.. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నటించిన బ్యూటీ అంటే.. ఠక్కున గుర్తు పడతారు. ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మాళవికా నాయర్.. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంది. కానీ అనుకున్నంత స్థాయిలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోలేకపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ మంచి ఫ్యామిలీ సినిమాతో రాబోతోంది. ఈ క్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఈ మధ్యే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చింది మళవిక నాయర్. నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా కూడా మాళవికకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకుంది. మాళవిక నాయర్, సంతోష్ శోభన్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘అన్ని మంచి శకునములే’ అనే సినిమా మే 18న విడుదల కాబోతుంది. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. దాంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. అందులో భాగంగా.. అన్నీ మంచి శకునములే ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకలావేదికలో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ డైరెక్టర్స్ నాగ్ అశ్విన్, అనుదీప్, హను రాఘవపూడితో పాటు.. హీరోలు న్యాచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్ ప్రత్యేక అతిథిలుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా.. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌తో డాన్స్ వేయాలని ఉందని అడిగింది మాళవిక నాయర్. దీంతో వెంటనే దుల్కర్ స్టేజి పైకి వెల్లగానే సీతా రామం సినిమాలోని సాంగ్ ప్లే అవుతుండగా స్టెప్పులేశారు. ఆ తర్వాత మాళవిక నాయర్ మాట్లాడుతూ.. నటిగా నాకు చక్కటి గౌరవాన్ని ఇచ్చారు. సంతోష్‌తో నటించడం చాలా సంతోషంగా వుంది. ఈ సినిమా వేసవికి చిరుగాలిగా వుంటుంది అన్నారు. ఇదిలా ఉంటే.. గతంలో మాళవిక నాయర్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ పై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రమోషన్స్ కోసం ‘నిన్ను ఉంచుకుంటాను అబ్బాయ్’ అని చెప్పేసింది మాళవిక. దానికి మన జాతిరత్నం తెగ సిగ్గుపడిపోయాడు. ఏదేమైనా ఈ సినిమా అయినా మాళవికకు హిట్ ఇస్తుందేమో చూడాలి.