ప్రస్తుతం బీ టౌన్లో మార్మోగిపోతున్న జంట వీళ్లు. రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఉన్న సూర్యఘర్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల ముందు నుంచే పెళ్లి వేడుకలు ప్రారంభం అయ్యాయి. ఒకరోజు హల్దీ, మరో రోజు సంగీత్ వేడుకలు అతిథులను అబ్బురపరిచాయి. నిజానికి వీళ్ల పెళ్లి ఫిబ్రవరి 6న అంటే నిన్ననే జరగాల్సి ఉన్నా.. పెళ్లిని ఒకరోజు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ కియారా అద్వానీ మెడలో సిద్ధార్థ్ తాళి కట్టనున్నాడు. పెళ్లి ముందు జైసల్మీర్‌లో బరాత్ నిర్వహించారు. బరాత్‌లో భాగంగా పూలతో అలంకరించిన గొడుగులను తీసుకొని ప్యాలెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకాసేపట్లో వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఫ్యామిలీలు, వాళ్ల సన్నిహితులు, కొందరు బాలీవుడ్ ప్రముఖలు హాజరయ్యారు. ఇషా అంబానీ, ఆనంద్ పరిమాళ్, కరణ్ జోహార్, షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్, జుహీ చావ్లా వేడుకల్లో సందడి చేశారు.