»Kgf Hero Yash Next Project To Be Announced In April
KGF Star Yash : కేజీఎఫ్ స్టార్ ‘యష్’ నెక్స్ట్ సినిమా ఏంటి? ఎవరు డైరెక్టర్? ఎప్పుడు షూటింగ్ స్టార్ట్?
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అసలు కేజీఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏది అంటూ అందరిలోనూ ఒక ఆసక్తి మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లీక్ బయటికి రాలేదు
KGF Star Yash : కేజీఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాలు చూడని వాళ్లు ఉండరు. దేశమంతా ఆ సినిమాను మెచ్చుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్ వన్ ఓ రేంజ్ లో సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి వరకు అసలు యష్ అంటే ఎవ్వరికీ తెలియదు. కేవలం కర్ణాటకకే పరిమితం అయిన యష్ ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. యష్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఉన్న క్రేజే వేరు.
కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యష్ తో సినిమాలు చేయడానికి స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టారు. అసలు కేజీఎఫ్ తర్వాత యష్ నటించబోయే సినిమా ఏది అంటూ అందరిలోనూ ఒక ఆసక్తి మొదలైంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లీక్ బయటికి రాలేదు కానీ.. యష్ తదుపరి సినిమాకు సంబంధించి పెద్ద అప్ డేట్ రాబోతోందట. వచ్చే నెలలోనే అంటే ఏప్రిల్ లో ఆ అప్ డేట్ రాబోతోందని అంటున్నారు. కబ్జా డైరెక్టర్ ఆర్ చంద్రు దర్శకత్వంలో యష్ పని చేస్తాడని అంటున్నారు.
KGF Star Yash : కేజీఎఫ్ ను మంచి తన తదుపరి సినిమా ఉండేలా యష్ ప్లాన్
కేజీఎఫ్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే కేజీఎఫ్ ను మించే ఉండాలి కదా. ఏమాత్రం అంచనాలు అందుకోకపోయినా ఫ్యాన్స్ నిరాశ చెందుతారు. బాహుబలి స్టార్ ప్రభాస్ విషయంలో అదే జరిగింది. అందుకే.. యష్ తొందరపడకుండా మంచి స్క్రిప్ట్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసినట్టు తెలుస్తోంది. చంద్రుతో యష్ సినిమా చేస్తున్నాడు అంటూ వచ్చే వార్తలు నిజం కావని.. అసలు యష్ ఇంకా ఏ స్క్రిప్ట్ ను ఫైనలైజ్ చేయలేదని అంటున్నారు. నార్తాన్ అనే కన్నడ డైరెక్టర్ తో యష్ సినిమా చేయబోతున్నారని కూడా వర్తలు వచ్చాయి.
ఏది ఏమైనా వచ్చే నెలలో మాత్రం యష్ సినిమాకు సంబంధించి పెద్ద అప్ డేటే ఉండబోతోందట. అది ఏంటి అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. యష్ తదుపరి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. గత సంవత్సరం 2022లోనే కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదలై కేజీఎఫ్ చాప్టర్ వన్ రికార్డులను బద్దలు కొట్టింది. కేజీఎఫ్ 2 రికార్డులను బద్దలు కొట్టేలా యష్ తదుపరి సినిమా ఉండబోతోందా? చూద్దాం మరి ఎలాంటి కాన్సెప్ట్ తో యష్ మళ్లీ వెండి తెర మీద కనిపించబోతున్నారో?