Kangana Ranaut: ఆ స్టార్ హీరోకి వైఫ్ ఉన్నా, నేనే కావాలి.. కంగనా షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఏం మాట్లాడిని కుండబద్దలు కొట్టినట్టుగా చెబుతుంది. ఎలాంటి విషయమైనా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ప్రస్తుతం చంద్రముఖి (chandramukhi) సీక్వెల్లో నటిస్తోంది కంగనా రనౌత్ (Kangana Ranaut). అలాగే ఇందిరా గాంధీ బయోపిక్ ఆధారంగా ఎమర్జెన్సీ అనే సినిమా చేస్తోంది. తాజాగా చంద్రముఖి2 నుంచి కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో కంగనా చాలా సింపుల్‌గా ఉంది. అసలు చంద్రముఖి అంటే ఎలా ఉండాలి జ్యోతికలా ఉండాలి. తన నటనతో అందరినీ భయపెట్టింది జ్యోతిక. ఇప్పటికీ చంద్రముఖి సినిమా చూస్తే జ్యోతిక నటనకు భయపడాల్సిందే. అంతలా ఇంపాక్ట్ చూపించింది జ్యోతిక క్యారెక్టర్. కానీ కంగనా రనౌత్‌ని మాత్రం బ్యూటీఫుల్‌గా చూపించారు మేకర్స్.
దాంతో చంద్రముఖి అంటే భయపెట్టాలి కదా, మరీ ఈ చంద్రముఖి ఏంటి ఇలా ఉంది? అనే కామెంట్స్ వినపడుతున్నాయి. ఇక ఇదిలా ఉండగానే.. కంగన చేసిన కొన్ని కామెంట్స్ కూడా వైరల్‌గా మారాయి. ఇండైరెక్ట్‌గా ఓ బాలీవుడ్ స్టార్ హీరో గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఓ పోస్ట్ పెట్టింది కంగనా. ‘ఓ సూపర్ స్టార్ తరచుగా నా ఇంటికి వచ్చేవాడు. డేట్ చేయమంటూ వేడుకునేవాడు. సీక్రెట్‌గా నన్ను ఫాలో అయ్యేవాడు. ఎందుకిలా చేస్తున్నావని అడిగితే.. తను ఆ డాడీ లిటిల్ ప్రిన్సెస్‌ని లవ్ చేయడం లేదని.. ఈ విషయం ఆమెకు చెప్పలేనని.. నువ్వు ఊ అంటే సీక్రెట్‌గా లైఫ్ లీడ్ చేద్దామని.. ఆ స్టార్ హీరో చెప్పినట్లు రాసుకొచ్చింది.
అంతేకాదు ఎన్ని సార్లు నంబర్ బ్లాక్ చేసినా వేరే నంబర్ల నుంచి కాల్ చేసేవాడని, తనకు బేబీ పుట్టిన కూడా మూవీ ప్రమోషన్ కోసం ఆడిన నాటకం అని.. స్టార్ హీరో అన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక ఆ హీరో ఎవరు? అనే విషయానికొస్తే బాలీవుడ్ వర్గాల ప్రకారం.. యంగ్ రణబీర్ కపూర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆ మధ్య రణ్‌బీర్, ఆలియా భట్ పెళ్లి సందర్బంగా ఆ పెళ్లి ఒక నాటకమని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. దీంతో ఇప్పుడు పెట్టిన పోస్ట్ రణబీర్ గురించేనని అంటున్నారు. రీసెంట్‌గానే రణ్‌బీర్, ఆలియా భట్‌కు కూతురు పుట్టిన సంగతి తెలిసిందే. అందుకే కంగనా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.