»Dont Disturb Me For A Year Even If You Are Dating Actress Madhavi Latha
Madhavi Latha: ఏడాది వరకు నన్ను డిస్టబ్ చేయోద్దు..డేటింగ్ లో ఉన్నా
ఓ అబ్బాయితో డేటింగ్ లో ఉన్నానని తనను ఏడాది వరకు డిస్టబ్ చేయోద్దని నటి మాధవిలత(Madhavi Latha) తన అభిమానులను కోరింది. ఈ మేరకు తన ఇన్ స్టా(instagram) ఖాతాలో వీడియో(Video) పోస్ట్ చేసి వెల్లడించింది. అయితే తన పెళ్లి విషయాన్ని మరో ఏడాది పాటు ప్రస్తావనకు తీసుకురావద్దని వెల్లడించింది. ఈ సమయంలో ఆమె డేటింగ్ చేస్తున్న వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనున్నట్లు స్పష్టం చేసింది.
నటి, తెలంగాణ బీజేపీ నాయకురాలు మాధవి లత(Madhavi Latha) సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్రేజీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే ఇంతకు ఆ వీడియోలో ఏముంది? ఎందుకు నెట్టింట వీడియో చక్కర్లు కోడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలో మాధవి లత తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడింది. అనేక మంది పెళ్లి ఎప్పుడు ఎప్పుడని కామెంట్లు చేసి ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో తనకు ఒక పొరగాడు తలిగిండని తెలంగాణ బాషలో చెప్పుకొచ్చింది. అయితే అతను మాత్రం మన తెలుగు వాడు కాదని స్పష్టం చేసింది. అయితే 100 శాతం అతను మాత్రం మన ఇండియన్ అని… మన భావజాలానికి తగ్గట్టే ఉంటడాని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో తన గురించి తెలుసుకోవడంతోపాటు అతనిని అర్థం చేసుకోవాలని చెప్పింది. దీంతోపాటు రెండు కుటుంబాల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. దీంతోపాటు వారు ఒప్పుకోవాలని వెల్లడించింది. ఇది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. అంతా సర్దుకుపోవడానికి మరో సంవత్సరం పట్టవచ్చు. ఈ క్రమంలో వచ్చే సంవత్సరం వరకు తనను ఎవ్వరూ కూడా డిస్టబ్ చేయోద్దని కోరింది. సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అతని గురించి, తన పెళ్లి గురించి మీకు చెప్తానని తెలిపింది. కాబట్టి, తన పెళ్లి తేదీ గురించి సహా ఇతర వివరాలు తనను ఏది అడగవద్దని అభిమానులకు సూచిస్తూ తన ఇన్ స్టా ఖాతాలో వీడియోను పోస్ట్ చేసి వెల్లడించింది.
మాధవి లత 2008లో విడుదలైన నచ్చావులే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా విజయం సాధించినా ఆమెకు పెద్దగా బ్రేక్ రాలేదు కానీ అడపాదడపా హిట్లు వచ్చాయి. ఆ తర్వాత మహేష్ బాబు అతిధిలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించింది. 2018లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేశారు. కానీ ఇటీవల తెలంగాణ బీజేపీలో చేరారు.