»Dont Believe The Rumours On The Tiger Nageswara Rao Movie Makers Clarity
Tiger Nageswara Rao: రూమర్స్ నమ్మొద్దు.. టైగర్ నాగేశ్వర రావు క్లారిటీ!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ పై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. అంటున్నారు మేకర్స్. అందుకే అదంతా అబద్ధం.. కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో రవితేజ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయింది.
ధమాకా, వాల్తేరు వీరయ్య జోష్లో వచ్చిన రవితేజ ‘రావణాసుర’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టసింది. ఆ లోటును పూడ్చేందుకు దసరా బరిలో సై అంటున్నాడు మాస్ మహారాజా. ఫస్ట్ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara Rao)’. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఆధారంగా తెరెక్కుతున్న ఈ సినిమాను.. వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ దసరా రేసు నుంచి టైగర్ డ్రాప్ అవుతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే దసరా రేసులో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న ‘భగతవంత్ కేసరి’ మూవీ ఉంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తున్న ‘లియో’ మూవీ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది.
దీంతో టైగర్ నాగేశ్వర రావు వెనక్కి తగ్గే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మేకర్స్ దృష్టికి వెళ్లడంతో.. రిలీజ్ డేట్ పై క్లారిటీ(Makers Clarity) ఇచ్చేశారు. ‘ ముందుగా చెప్పిన ప్రకారమే టైగర్ నాగేశ్వర రావు సినిమాను అక్టోబర్ 20వ తేదీన విడుదల చేయనున్నామనీ, రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మొద్దని అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. దీంతో బాలయ్యతో రవితేజ బాక్సాఫీస్ వార్ ఫిక్స్ అయిపోయినట్టే. ఇక ఈ సినిమాతో కథానాయికగా కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోంది. మరి టైగర్ నాగేశ్వర రావు ఎలా ఉంటుందో చూడాలి.