»A Viral Video Of Pushpa Heroine Rashmika Mandanna Skipped By Shraddha Kapoor
Viral video: పుష్ప హీరోయిన్ రష్మికకు ఘోర అవమానం!
పుష్ప మూవీ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ తోపాటు బాలీవుడ్లో కూడా అనేక మందికి తెలుసు. కానీ ఇటివల ముంబయిలో ఓ వేడుకకు వెళ్లిన రష్మికకను హీరోయిన్ శ్రద్ధాకపూర్ పక్కనుంచే వెళ్లినా కూడా కనీసం పట్టించుకోలేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
A viral video of pushpa heroine Rashmika mandanna skipped by shraddha kapoor
రష్మిక మందన్న(Rashmika mandanna) సౌత్ ఇండియన్ సినిమాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో బాలీవుడ్ లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడ రెండు సినిమాలు చేసింది. కానీ ఆ రెండు హిట్ కాలేకపోయాయి. మిషన్ మజ్నూ పర్వాలేదనిపించింది. ఆ సినిమాలో కళ్లులేని యువతి పాత్రలో నటించి మెప్పించింది. మరో రెండు, సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఆమె నటించిన యానిమల్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాంటి రష్మికకు, బాలీవుడ్ నటి నుంచి చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వీడియోలో రష్మిక, అంబానీ ఫ్యామిలీ నిర్వహించిన గణేష్ ఉత్సవ వేడుకల్లో ఇటివల పాల్గొనడానికి వెళ్లింది. అక్కడ ఆమెకు శ్రద్ధా కపూర్(shraddha kapoor) ఎదురైంది. అయితే, ఆమెను పలకరించడానికి రష్మిక ఎదురు వెళ్లింది. అయితే, రష్మిక ఎదురుగా ఉండగా.. ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా..శ్రద్ధ పలకరించకపోవడాన్ని గమనించిన అభిమానులు, మండిపడుతున్నారు. రష్మికను కావాలనే శ్రద్ధ పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. అభిమానులు కామెంట్స్ విభాగంలోకి వెళ్లి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కావాలనే శ్రద్ధా కపూర్ రష్మికను పలకరించలేదని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కొందరు మాత్రం శ్రద్ధను సమర్థిస్తున్నారు. ఆమె ఆమెను గుర్తించి ఉండకపోవచ్చని అంటున్నారు. రష్మిక మందన ఎవరో ఆమెకు తెలియకపోవచ్చని మరి కొందరు కామెంట్స్(comments) చేస్తున్నారు.