‘లక్కీ భాస్కర్’ సక్సెస్ మీట్ లో దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రేక్షకులతో తనకు మంచి అనుంబంధం ఏర్పడిందన్నారు. ఓకే బంగారం మూవీ కోసం దిల్ రాజు తనకు ఆఫర్ ఇచ్చినా తెలుగు భాషకు భయపడి ఒప్పుకోలేదన్నారు. నాగ్ అశ్విన్, స్వప్న దత్ తనను ఒప్పించి మహానటి సినిమా చేయించారని పేర్కొన్నారు. ‘లక్కీ భాస్కర్’ మూవీతో తెలుగు ప్రజలకు మరింత దగ్గరయ్యానని అన్నారు.