»Mummified Sheep Heads Over 2000 Unearthed In Egypt Temple
Sheep Heads: షాకింగ్..ఈజిప్ట్ ఆలయం కింద వేలాది గొర్రెల తలలు
ఈజిప్టు(Egypt)లో పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో కొత్త వాటిని గుర్తించారు. ఓ ఆలయం(Temple) కింద సుమారుగా రెండు వేలకు పైనే గొర్రె తలల(Sheep Heads) మమ్మీలు కనిపించాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్సెస్ ఆలయంలో నైవేధ్యంగా ఉంచి మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిస మమ్మీలు(Mummies) కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి.

క్రీస్తు పూర్వం 1304 నుంచి 1237 వరకూ ఏడు దశాబ్దాల పాటు ఈజిప్టు(Egypt)ను రామ్ సెస్2 పరిపాలిస్తూ ఉండేవారు. ఆయన మరణించిన వెయ్యేళ్లకు ఆరాధన ఉత్సవాల్లో వేల సంఖ్యలో గొర్రెలు, మేకలు, ఆవులు, కుక్కలు వంటి జంతువు(Animals)లను బలి ఇచ్చినట్లు తెలుస్తోంది. మమ్మీలు(Mummies)గా చేసిన జంతువుల అవశేషాలతోపాటు సుమారు 4,000 సంవత్సరాలు కిందట నిర్మించిన ఐదు మీటర్ల మందం 16 అడుగుల గోడలతో కూడిన శిథిలాలు, అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లు వంటి వాటిని కూడా పరిశోధకులు కనుగొన్నారు.