Powassan virus: మరో ప్రాణాంతక వైరస్.. ఒకరి మృతి..!
కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా మారిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికించింది. ఈ కరోనా ధాటికి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గిందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అలాంటి సమయంలో మరో కొత్త రకం వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. తాజాగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది.
వీటిలో కొన్ని వైరస్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. కరోనా, మంకీపాక్స్, ఎబోలా ఇలా పలు రకాల వైరస్ లు మానవాళిపై దాడులు చేస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన పొవాసాన్ వైరస్ అనే ప్రాణాంతక వైరస్ కారణంగా యునైటెడ్ స్టేట్స్లో ఒకరు మరణించారు. ఈ ఏడాది అమెరికాలోని మైనేలో పోవాసన్ వ్యాధి మొదటి కేసు నమోదైంది. పోవాసాన్(Powassan virus) అంటు వ్యాధులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ..ఇటీవలి సంవత్సరాలలో ముఖ్యంగా యూఎస్(USA), కెనడా, రష్యాలలో సంక్రమణ పెరిగింది. ఈ క్రమంలోనే దీని గురించి ప్రపంచ స్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
2015 నుంచి మైనేలో దాదాపు 15 ఇన్ఫెక్షన్ కేసులు నమోదైన తర్వాత..గత సంవత్సరం రెండు మరణాలు నమోదయ్యాయి. తాజా మరణంతో మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఇక యూఎస్‌లో ప్రతి సంవత్సరం 25 మంది వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారంటూ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ వైరస్(virus) గురించి ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో..వైరస్ లక్షణాలు, కారణాలు, చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పొవాసాన్ వైరస్(Powassan virus) జింక పేలు, గ్రౌండ్‌హాగ్ పేలు లేదా ఉడుత పేలు వంటివి కాటు వేయటం వల్ల వ్యాధి వ్యాపిస్తుంది. చాలా కేసులు ఈశాన్య, గ్రేట్ లేక్స్ ప్రాంతాల నుంచి వసంతకాలం చివరి నుంచి మధ్య శరదృతువు వరకు నమోదవుతున్నట్టుగా తెలిసింది. ఈ సమయంలో పేలు చాలా చురుకుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. లక్షణాలు: జ్వరం, తలనొప్పి, వాంతులు, బలహీనత వంటి లక్షణాలు ఉండవచ్చు. ఇది మెదడు సంక్రమణకు కారణమవుతుంది. మెదడు, వెన్నుపాము లో పేరుకుపోతుంది.