»If You Drink Buttermilk After Meal The Stomach Will Be Cool
Buttermilk : భోజనం తర్వాత మజ్జిగ తాగితే కడుపు అంత చల్లదనమే..
మజ్జిగకు (buttermilk) మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో (Summer) శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
మజ్జిగకు (buttermilk) మన ప్రాచీన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యం ఉంది. అప్పట్లో ఎక్కువగా మజ్జిగనే వాడేవారు. ఆహారం తర్వాత మజ్జిగను తీసుకోవడం వల్ల జీర్ణక్రియలు సాఫీగా సాగడంతోపాటు, అసిడిటీని నివారిస్తుంది. మజ్జిగలో ప్రొబయాటిక్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన పేగులకు ఎంతో మంచి చేస్తుంది. వేసవిలో (Summer) శరీరంలో వేడిని మజ్జిగ హరిస్తుంది. అందుకని వేసవిలో మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
మజ్జిగలో మిరియాల పొడి, (Pepper) ధనియాల పొడి, ఎండబెట్టిన అల్లం పౌడర్ (Ginger powder) వేసుకుని అయినా తీసుకోవచ్చు. మజ్జిగ తీసుకోవడం వల్ల ప్రొటీన్, క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొబయాటిక్ అందుతాయి. వీటితో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి మజ్జిగ మంచి ఔషధం అవుతుంది. బరువు తగ్గాలనుకునేవారు పెరుగుకు బదులు మజ్జిగ (buttermilk) వాడుకోవాలి. ఆరోగ్యానికి మంచి చేసే బ్యాక్టీరియా, ల్యాక్టిక్ యాసిడ్ ఉండడంతో జీర్ణక్రియలకు మేలు జరుగుతుంది.
ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడే వారికీ మజ్జిగతో మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే తీసుకున్న మజ్జిగ కడుపులోని యాసిడ్స్ ను క్లియర్ చేస్తుంది. అసిడిటీకి మజ్జిగ మంచి ఔషధం. దీనికి మిరియాలు, ధనియాల పొడి, యాడ్ చేసుకోవాలి.
యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడే వారికి మజ్జిగతో మంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణాశయంలోని గోడల లైనింగ్ ఇరిటేషన్ ను తగ్గిస్తుంది.
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే చాలా మంది వాటిని ఉపయోగించుకోవడం ఎలాగో తెలియక.. జంక్ ఫుడ్స్‌కు (Junk foods) అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ఇక మన వంటింటిలో వాడే చాలా ఆహార పదార్దాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
మజ్జిగ లేదా బట్టర్ మిల్క్, (butter milk) లస్సీ, (lassi) సల్ల అని ఏ పేరుతో పిలుచుకున్నా దాని ప్రయోజనాలు అమోఘమే. ఇక వేసవి కాలం సమీపిస్తున్న ఈ తరుణంలో ఒక గ్లాసు మజ్జిగ మీ కడుపుకు మంచి ఉపశమనం కలిగించే పానీయం. లంచ్ లేదా డిన్నర్ తర్వాత దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా ఎసిడిటీని నివారిస్తుంది. సల్లలో కేలరీల తక్కువ ఉంటాయి కాబట్టి అధిక బరువు తగ్గించచుకోవడానికి ఇది మంచి పానీయం. అయితే భోజనం (meal) తర్వాత మజ్జిగను తాగడం వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. బటర్ మిల్క్ మన జీర్ణవ్యవస్థకు ఒక వరం. మజ్జిగలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా,(Bacteria) లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుందిపెద్దపేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ సహాయపడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా మీ పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గించవచ్చు. బటర్ మిల్క్ తీసుకోవడం వల్ల ఆసిడిటీని నివారించవచ్చు. మజ్జిగలో శొంఠి లేదా మిరియాలు వంటి మసాలా దినుసులను కలిపి తాగడం వలన ఆసిడిటీని దూరం చేయవచ్చు. ఆరోగ్యకరమైన ప్రేగులు బలమైన రోగనిరోధక శక్తికి పునాది. మజ్జిగ ఆరోగ్యకరమైన పేగులకు అవసరమయ్యే పోషణ అందిస్తుంది. ఇది జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు అన్నింటిని సెట్ చేస్తుంది.