రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన లడ్కీ చిత్రంతో తెలుగు ప్రజలకు పరిచయం అయింది పూజా భలేకర్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన పూజా పలు అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ పూణె ఆన్‌లైన్ 2014, మిస్ నవీ ముంబై ఆన్‌లైన్ 2014 టైటిల్‌ను గెలుచుకుంది. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తోంది.
షాలిని పాండే భారతీయ నటి. 2017లో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రంతో అరంగేట్రం చేసింది. శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది.
శ్రేయ ధన్వంతరి టెలివిజన్ రంగంలో రాణించి ఆ తరువాత సినిమాల్లో అరంగేట్రం చేసింది. జోష్ చిత్రంలో నటించింది. ఆ తరువాత హిందీ వెబ్ సిరీస్‌లలో నటిస్తుంది. తన హాట్ పిక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ను హీట్ ఎక్కిస్తుంది.
మహిరా శర్మ హిందీ నటి. టీవీ సీరియల్ ద్వారా వెండితెరకు పరిచయం అయింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటలతో అలరిస్తుంది.
హుషారు సినిమాతో వెండి తెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ దక్ష నాగర్కర్. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబీ రెడ్డి సినిమాలో నటించింది. బంగార్రాజులో ఓ క్యారెక్టర్ చేసి, ఈవెంట్‌లో నాగచైతన్యకు స్మైల్ ఇస్తే వైరల్ అయింది.
పొలిమేర 2 చిత్రం బ్లాక్ బ్లస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చేతబడులు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో పాత్రలు చేసిన కామాక్షి.. పొలిమేర 2లో లక్ష్మీ పాత్రతో ఆమెకు ఎనలేని గుర్తింపు వచ్చింది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కామాక్షి ఎలా ఉందో చూస్తే మతిపోవాల్సిందే.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. జనవరి 12న సినిమా విడుదల అవుతుంది.
మిర్నా మీనన్ జైలర్ చిత్రంతో అందరికి సుపరిచితం అయింది. ఆమె 2018లో సంతన దేవన్ అనే తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ కుర్రకారు మతిపోగొడుతుంది.
నేల టిక్కెట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాళవిక శర్మ తన అందమైన నవ్వుతో సోషల్ మీడియాలో మాయ చేస్తోంది.
హిట్ 2 చిత్రంలో కాప్‌గా వెండితెరపై మెరిసిన తెలుగు అమ్మాయి కోమలి ప్రసాద్. ప్రస్తుతం శశివదనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది. సోషల్ మీడియాలో తన చీరకట్టు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
దివ్యా పిళ్లై 2015 మలయాళ చిత్రం అయల్ నజనల్లతో సినీరంగంలోకి ప్రవేశించింది. ఆర్య హీరోగా ది విలేజ్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన మంగళవారం చిత్రంలో జమీందారి వైఫ్ క్యారెక్టర్ చేసి నేషనల్ క్రష్ లిస్ట్ లో చేరింది.
యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న ‘బబుల్‌గమ్’ సినిమాతో మానస చౌదరి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మానస చౌదరి అందం, రోషన్‌తో ఆమె కెమిస్ట్రీ చూసి కుర్రకారు ఫిదా అయిపోయారు. డైరెక్టర్ రవికాంత్ పేరేపు హీరోయిన్ గా మానస చౌదరిని వెండితెరపైకి తీసుకొచ్చారు. మూవీ విడుదల తర్వాత మానస చౌదరి అందం, అభినయం, నటనకు మంచి మార్కులు పడ్డాయి.
సంజీదా షేక్ హిందీ టెలివిజన్ రంగంలో ఎంతో పేరుపొందిన నటీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన హాట్ ఫోటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
సలార్ చిత్రంతో ఒక్కసారిగా అందరి చూపులను తనవైపు తిప్పుకున్న నటీ శ్రియా రెడ్డి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సలార్ 2 తో పాటు తాను పవన్ కల్యాణ్ ఓజీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
నోరా ఫతేహి నటి, డ్యాన్సర్, మోడల్, సింగర్, రియలిటీ షో జడ్జి. ఆమె 2014లో హిందీ సినిమా రోర్ : టైగెర్స్ అఫ్ ది సుందర్బన్స్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి తెలుగులో టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడారు. తరువాత బాహుబలి సినిమాలో మనోహరి పాటలో నర్తించారు.