బింబిసారతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు ‘అమిగోస్’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. అయితే అమిగోస్తోనను రాజేంద్ర రెడ్డి అనే కొత్త దర్శకుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు కళ్యాణ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం ట్రిపుల్ రోల్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, పోస్టర్స్ అందరినీ సినిమా పై అంచనాలను పెంచేశాయి. ఫిబ్రవరి 10న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. అందుకే అమిగోస్ మూవీ వాయిదా వేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. దాంతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. అనుకున్న సమయానికే ‘అమిగోస్’ ఆడియెన్స్ ముందుకు రానుందని ప్రకటించారు. ఈ క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 10న సినిమా రిలీజ్ ఉండడంతో.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను 5న గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. దాంతో ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గెస్ట్‌గా వస్తున్నాడా.. లేదా.. అనే చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం మాత్రం.. మరోసారి అన్న కోసం ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బింబిసార ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో.. సినిమా పై ఒక్కసారిగా భారీ హైప్ వచ్చింది. అందుకే ఇప్పుడు అమిగోస్ కోసం తారక్ రావడం పక్కా అంటున్నారు. త్వరలోనే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.