హృతిక్ రోషన్ క్రిష్ సినిమాను అంత ఈజీగా మరిచిపోవడం కష్టం. అప్పట్లో ఇండయన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదేపింది ఈ సూపర్ హీరో సినిమా. ఇప్పటికే మూడు ఫ్రాంఛైజీలు వచ్చాయి. దాంతో క్రిష్ 4 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే గత కొంత కాలంగా ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. కానీ కరోనా కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత 2022లో సెట్స్ పైకి వెళ్లడం ఖాయమన్నారు. కానీ ఇప్పటి వరకు మరో అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సూపర్ సిరీస్‌కు రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది. తాజాగా నిర్మాత, హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ ఓ ఇంటర్వ్యూలో క్రిష్ 4 అప్డేట్ ఇచ్చాడు. ఒక పాపులర్ హిందీ న్యూస్ పోర్టల్‌తో మాట్లాడుతూ.. ‘త్వరలో ఏదో ఒకటి చెబుతాం.. ప్రస్తుతం సీరియస్‌గా వర్క్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. అయితే గతంలోను ఆయన ఇలానే చెప్పాడు. కానీ ఈసారి మాత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. దాంతో ఈ ఏడాదిలోనే క్రిష్ 4 సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇకపోతే.. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించి నిర్మించిన క్రిష్ ఫ్రాంచైజీ 2003లో కోయి మిల్ గయాతో మొదలైంది. ఆ తర్వాత 2000లో క్రిష్, 2013లో క్రిష్ 3 విడుదలయ్యాయి. ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత క్రిష్ 4 రాబోతోంది. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతున్నాయి సినిమాలు. కాబట్టి క్రిష్ 4 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే దీనికంటే ముందు.. పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు హృతిక్ రోషన్. ఆ తర్వాతే క్రిష్ 4 ఉండనుంది.