ప్రపంచ శాంతి కోసం అయోధ్యలో మహాయాగం నిర్వహిస్తున్నామని విజయేంద్ర సరస్వతి వెల్లడించారు. నవంబర్ 18 నుంచి జనవరి 1 వరకూ జరగబోయే మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహాయాగంలో 1200 మందికి పైగా వేద పండితులు పాల్గొంటారన్నారు. యాగంలో ఉపయోగించే శ్రీరామ యంత్రానికి పూజలు నిర్వహించి, తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకెళ్తున్నామని తెలిపారు.