షిర్డీ సాయిబాబా (Shirdi Saibaba) భక్తులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ (Hyderabad) నుంచి షిర్డీ వెళ్లే భక్తుల కోసం సరికొత్త ఆఫర్ను ప్రకటించింది. రూ.3వేల ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ చూసే అవకాశం కల్పించింది. ప్రతి బుధవారం హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీలో టూర్ అందుబాటులో ఉండనున్నది. ‘సాయి సన్నిధి’ ‘(Sayi sannidhi) పేరుతో ప్యాకేజీని తీసుకువచ్చింది. రెండు రోజులు, మూడురాత్రులు టూర్ కొనసాగనున్నది. సాయి సన్నిధి ప్యాకేజీ టూర్ (Package tour) తొలి రోజు హైదరాబాద్లో మొదలవుతుంది. బుధవారం సాయంత్రం 6.50 గంటలకు సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ రైలు ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా రైలులో ప్రయాణం కొనసాగుతుంది.రెండో రోజు రైలు ఉదయం 7.10 గంటలకు నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. అక్కడి నుంచి షిర్డీకి బయలుదేరి వెళ్లాల్సి ఉంటుంది. హోటల్లో చెకిన్ అవ్వాలి. ఆ తర్వాత సాయిబాబా ఆలయ దర్శనం ఉంటుంది. అయితే, సొంత ఖర్చులతోనే సాయిబాబాను దర్శించుకోవాల్సి ఉంటుంది. ఐఆర్సీటీసీ (IRCTC) నిర్ణయించింది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్లో వసతి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కవర్కానున్నాయి. పూర్తి వివరాలకు https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR009 లింక్లో చూడవచ్చు.