తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. గోదావరి, కృష్ణానదుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు.