TG: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, సెలవు రోజు కావటంతో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ నెలకొంది. లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. ప్రసాద విక్రయశాల, కొండ కింద, కారు పార్కింగ్, బస్టాండ్లో రద్దీ నెలకొంది.