తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు TTD గుడ్న్యూస్ చెప్పింది. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒక్కరోజులోనే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేశామని, అదేరోజున వాహనసేవల్లో పాల్గొనవచ్చని ఈవో శ్యామలరావు తెలిపారు. వీఐపీ సిఫార్సు దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే దర్శనాలు ఉంటాయని, గరుడసేవ(8వ తేదీ) రోజున వీఐపీ దర్శనాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు.