»Bharat Jodo Nyay Yatra Case Registered Against Rahuls Nyay Yatra What Is The Reason
Bharat Jodo Nyay Yatra: రాహుల్ న్యాయ్ యాత్రపై కేసు నమోదు.. కారణమిదే?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్నారు. ఈక్రమంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్రపై అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు.
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ న్యాయ్ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి యాత్ర రూట్స్‌లో మార్పులు చేశారు. దీంతో పోలీసులు యాత్ర నిర్వాహకుడు కేబీ బైజుపై కేసు నమోదు చేశారు. అస్సాంలోని జోర్హాట్ పట్టణంలోని ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. అయితే ముందుగా నిర్దేశించిన మార్గంలో కాకుండా వేరే మార్గంలోకి యాత్రను మళ్లించినట్లు అస్సాం పోలీసులు తెలిపారు.
ఇది కూడా చూడండి: Ayodhya ram mandir: అయోధ్యలో 550 ఏళ్ల తరువాత కొలువైన రామయ్య
చార్ట్‌లో చూపించని మార్గాన్ని ఎంచుకున్నారని.. రూట్‌ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ట్రాఫిక్ అంతరాయం జరిగిందని తెలిపారు. యాత్ర నిర్వాహకులు, సహ నిర్వాహకులు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టేలా అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని ఆరోపించారు. అలాగే అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిపై కూడా దాడి చేశారని తెలిపారు. అయితే భారత్ జోడో న్యాయ్ యాత్రపై కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు.