రిలయన్స్ జియో.. జియో భారత్ దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద రూ.999కి లభిస్తున్న 4G ఫోన్లను కేవలం రూ.699లకు అందిస్తోంది. ఈ అవకాశం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో కంపెనీ తెలిపింది. 2G ఫీచర్ ఫోన్ల నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలనుకునే వారికి ఇదొక గొప్ప అవకాశం. అలాగే, వినియోగదారులు రూ.123 నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆస్వాదించవచ్చు. అన్లిమిటెడ్ ఫోన్ కాల్స్, 14GB డేటా వస్తుంది.