»Icc Cricket Wc 2023 Disney Star Wants To Make Rs 30 Lakh From 10 Sec Ad Slots In Remain Matched
Disney+Hotstar: వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు గెలిచినా హాట్‌స్టార్ ఓడిపోడు.. 10 సెకన్ల యాడ్‌కు రూ.30 లక్షలు!
డిస్నీ హాట్‌స్టార్ ప్రపంచ కప్‌లోని మిగిలిన నాకౌట్ మ్యాచ్‌లలో భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. డిస్నీ హాట్‌స్టార్ నాకౌట్ , ఫైనల్ మ్యాచ్‌ల కోసం ప్రకటన స్లాట్లను 10 సెకన్లకు రూ. 30 లక్షలకు విక్రయించబోతోంది.
Disney+Hotstar: డిస్నీ హాట్‌స్టార్ ప్రపంచ కప్‌లోని మిగిలిన నాకౌట్ మ్యాచ్‌లలో భారీగా సంపాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. డిస్నీ హాట్‌స్టార్ నాకౌట్ , ఫైనల్ మ్యాచ్‌ల కోసం ప్రకటన స్లాట్లను 10 సెకన్లకు రూ. 30 లక్షలకు విక్రయించబోతోంది. ఇంతకుముందు భారత్ మ్యాచ్‌లకు ఈ ధర రూ. 22 లక్షలు కాగా, ఇతర మ్యాచ్‌లకు రూ.10 లక్షలుగా ఉండేది. భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన కారణంగా డిస్నీ స్టార్ వ్యాపార వృద్ధి అవకాశాలు మరింత పెరిగాయి. అధిక ధరలకు ప్రకటనల స్లాట్లను విక్రయించడం హాట్ స్టార్‌కు కలిసి రావడం లేదు. ఇంత ఖరీదైన స్లాట్‌ని కొనుగోలు చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. దీంతో అధిక ధరలకు విక్రయించడం హాట్‌స్టార్‌కు చాలా సవాలుగా ఉంటుంది.
క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం చాలా మంది ప్రకటనదారులు సెట్ చేసిన బడ్జెట్ ఇప్పటికే అయిపోయింది. మిగిలిన డిస్నీ స్టార్ నాకౌట్ మ్యాచ్‌లు, ఫైనల్స్‌కు సంబంధించి ఇంకా కొంత ఇన్వెంటరీని కలిగి ఉంది. 10 సెకన్లకు రూ.30 లక్షలు ఆశిస్తున్నారు. జనాల్లోకి వెళ్లాలంటే ప్రకటనదారులు కనీసం రూ. 3-4 కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఇది ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్లో 3 నుండి 4 వారాల పాటు అడ్వర్ టైజ్మెంట్ నిర్వహించడానికి అయ్యే ఖర్చుతో సమానం. 10 సెకన్ల స్లాట్ కోసం కొంతమంది కస్టమర్లు రూ.30 లక్షలతో అడ్వర్టైజింగ్ స్పాట్లను కొనుగోలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు.. ఈ మెగా ఈవెంట్‌ను సద్వినియోగం చేసుకోవాలనుకున్న చాలా మంది పెద్ద ప్రకటనదారులు ఇప్పటికే ప్రపంచ కప్‌లో పాల్గొన్నారని డిస్నీ హాట్ స్టార్ ప్రతినిధులు తెలిపారు.
టోర్నమెంట్ ప్రారంభం కావడానికి ముందు, డిస్నీ స్టార్ ఇండియా మ్యాచ్‌లు, నాకౌట్ మ్యాచ్‌ల కోసం 10-సెకన్ల అడ్వర్టైజింగ్ స్లాట్‌కు రూ. 31 లక్షలు కోట్ చేయాలని అనుకుంది. అయితే, చర్చల తర్వాత భారత్ మ్యాచ్‌లకు సగటున 10 సెకన్లకు రూ. 22-25 లక్షలు, మొత్తం ప్రపంచ కప్ 2023కి రూ. 9-10 లక్షలు చొప్పున ఒప్పందం కుదిరింది. డిస్నీ స్టార్ క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడతో సహా పలు భాషల్లో ప్రసారం చేస్తోంది. నవంబర్ 15 బుధవారం భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నవంబర్ 16, గురువారం జరగనుంది. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఇప్పటికే ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్‌కు చేరుకుంది.
బుధవారం హాట్‌స్టార్‌లో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్‌ను 5.3 కోట్ల మంది వీక్షించడం ఒక రికార్డు. అంతకు ముందు నవంబర్ 5న భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌ను హాట్‌స్టార్‌లో 4.4 కోట్ల మంది వీక్షించారు. రికార్డు వీక్షకుల సంఖ్య నిరంతర పెరుగుదల కారణంగా డిస్నీ షేర్లలో కూడా పెరుగుదల కనిపించింది. బుధవారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కంపెనీ షేర్లు 3.14 శాతం పెరిగి దాదాపు 94 డాలర్లకు చేరాయి. భారత్‌లో ప్రపంచకప్ ప్రారంభమైనప్పటి నుంచి డిస్నీ షేర్లు దాదాపు 20 శాతం పెరిగాయి. బుధవారం కంపెనీ మార్కెట్ క్యాప్‌లో 5 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుదల కనిపించింది.