Gold and Silver Rates Today : పసిడిని కొనుక్కోవాలని, పెట్టుబడి మార్గంగా మలుచుకోవాలని ఆలోచనల్లో ఉన్న వారు రోజువారీ పసిడి రేట్లను తెలుసుకుంటూ ఉండటం అత్యావస్యకం. మరి ఇవాల్టి బంగారం, వెండి ధరలు ఎలా ఇక్కడ చదివేయండి. దేశీయ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర(Gold Rate) రూ.64,148 ఉండగా, బుధవారం నాటికి రూ.39 తగ్గి రూ.64,109కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.71,484 ఉండగా, బుధవారం నాటికి రూ.31 పెరిగి రూ.71,515కు చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నం, ప్రొద్దుటూరుల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 64,109 గా కొనసాగుతోంది. అలాగే ఈ నాలుగు పట్టణాల్లోనూ కిలో వెండి ధర రూ.71,515గా ఉంది. ఈ ధరలన్నీ మార్కెట్ల ప్రారంభం అయ్యే సమయానికి ఉన్నవని గుర్తుంచుకోవాలి. అలాగే ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ ధరలు అన్నింటికీ మజూరీలు, ట్యాక్సులు తోడవుతాయని గుర్తుంచుకోవాలి.
అంతర్జాతీయ మార్కెట్లో మంగళవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2032 డాలర్లు ఉండగా, బుధవారమూ 2032 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర(Silver Rate) 22.48 డాలర్లుగా ఉంది.