దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 77,548 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,339.01) లాభాల్లో ప్రారంభమైంది. దాదాపు 1100 పాయింట్లకు పైగా లాభపడి 78,451 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివర్లో అమ్మకాలతో 239 పాయింట్ల లాభంతో 77,578.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64.70 పాయింట్ల లాభంతో 23,518 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.84.42గా ఉంది.