ఈ వారం మూడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. ప్రధాన విభాగంలో జింకా లాజిస్టిక్స్.. SME విభాగంలో మంగళ్ కాంపుసొల్యూషన్, ఆనిక్స్ బయోటెక్ ఉన్నాయి. గతవారం ప్రారంభమైన నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ సబ్ స్క్రిప్షన్ గడువు ఇవాళ్టితో ముగియనుండగా ఈ కంపెనీల షేర్లు.. ఈ వారమే స్టాక్స్‌లో నమోదు కానున్నాయి. వీటితో పాటు స్విగ్గీ, సాగిలిటీ ఇండియా, ఆక్మే సోలార్ హోల్డింగ్స్ షేర్లు లిస్ట్ అవనున్నాయి.