సత్యసాయి: లేపాక్షి మండలం కస్తూరిబాయ్ స్కూల్ సమీపంలో చిలమత్తూరు వైపు వెళ్తున్న శ్రీకాంత్ అనే యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. తమ్మినాయనపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ జనసేన కార్యకర్తగా ఉన్నాడు. ప్రమాదం అనంతరం స్థానికులు అతనిని అంబులెన్స్‌లో హిందూపురం తీసుకెళ్లారు. అంబులెన్స్ డ్రైవర్ ఆకుల ఉమేష్ ఈ సహాయ చర్యలో పాల్గొన్నారు.