గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. విషవాయువు పీల్చి ఇద్దరు కార్మికులు మృతిచెందగా.. మరో ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. నారోల్ పారిశ్రామిక ప్రాంతంలోని దేవి సింథటిక్స్ ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీలోని ట్యాంకులోకి యాసిడ్‌ను పంపిస్తున్నప్పుడు 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే వారిని LG ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి ఇద్దరు కార్మికులు మరణించారు.