విజయవాడలో మద్యం తాగి వాహనాలను నడిపిన 249 మందికి న్యాయమూర్తులు జరిమానా విధించారు. సీపీ రాజశేఖర్ బాబు తెలిపిన వివరాల ప్రకారం గత నెల 2వ తేదీ నుంచి నేటి వరకు రాత్రి సమయాలలో డ్రైవ్ నిర్వహించి 249 మంది వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడుపుతూ పట్టుబడ్డారని అన్నారు. 40 మందికి ఒక్కొక్కరికి రూ.15,000/- చొప్పున మిగిలిన 209 మందికి ఒక్కొక్కరికి రూ.10,000/. జరిమాన విధించారు.