KNR: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేర్ డ్యామ్‌లో పడి యువకుడు మృతి చెందాడు. తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన సాయి కుమార్ (26) ప్రమాదవశాత్తు అందులో పడ్డాడా..? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉందని గ్రామస్థులు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.