కేవలం రూ.15 కోసం ఓ వ్యక్తి మహిళ ముక్కును నరికాడు. ఈ ఘటన బీహార్లోని అరారియాలో చోటుచేసుకుంది. బాధితురాలు ఓ దుకాణదారుడికి రూ.15 అప్పు ఉంది. బకాయి తిరిగి ఇవ్వాలని అతను అడగ్గా.. చిల్లర డబ్బులు లేవని.. తర్వాత ఇస్తామని చెప్పింది. దీంతో ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. అది తీవ్రస్థాయికి చేరింది. అతను ఆ మహిళపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ముక్కు కట్ అయింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.