ఫిలిప్పీన్స్లో ట్రామీ తుఫాను విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో దాదాపు 130 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలామంది గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విధ్వంసంలో చిక్కుకున్న ప్రజలను వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.