ELR: ముసునూరు మండల పరిధిలోని బలివే, ఎల్లాపురం గ్రామాలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ప్రాంతాలలో దాడులు నిర్వహించినట్లు ప్రొహిబిషన్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 65 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.