»Stones Pelting On Vande Bharat Express In Mahabubabad
Vande Bharat Express : మరోసారి వందే భారత్ రైలుపై రాళ్ల దాడి.. ఈసారి ఎక్కడంటే?
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు
Vande Bharat Express : వందే భారత్ రైలు గురించి తెలుసు కదా. తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవలే ఈ ట్రెయిన్ ప్రారంభం అయింది. ప్రారంభం కాకముందే ఈ ట్రెయిన్ పై వైజాగ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈనెల 3న ఖమ్మం జిల్లాలోనూ రైలుపై దాడి జరిగింది. తాజాగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మరోసారి వందే భారత్ రైలుపై దాడి జరిగింది.
మహబూబాబాద్, గార్ల స్టేషన్ల మధ్య ఈ దాడి చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో నాలుగో నెంబర్ కోచ్ అద్దాలు పగిలాయి. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ అద్దాలు మాత్రమే పగిలాయి కానీ.. ప్రయాణికులకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే శాఖ తెలిపింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Vande Bharat Express : ఖమ్మంలోనూ ఆకతాయిల దాడి
ఖమ్మంలోనూ ఇటీవల వందే భారత్ రైలుపై దాడి చేయడంతో రైలు అద్దాలు పగిలాయి. ముగ్గురు యువకులు కావాలని రైలుపై రాళ్లు రువ్వారు. రైలు ప్రారంభం కాకముందే వైజాగ్ లో ఆగి ఉన్న రైలుపై కొందరు యువకులు రాళ్లు విసిరారు. దీంతో రెండు కోచ్ ల అద్దాలు పగిలాయి. వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఎన్ని అరెస్టులు జరిగినా.. రైలుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. రైలుపై జరిగే దాడి మాత్రం ఆగడం లేదు.