Stock Market: 680 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్..రుపాయి ఢమాల్?
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం (ఆగస్టు 2న) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. ఒక దశలో సెన్సెక్స్(sensex) 550 పాయింట్లు, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయింది. మరోవైపు ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.
ఇండియన్ స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం (ఆగస్టు 2న) భారీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. BSE సెన్సెక్స్ ఒక దశలో 566 పాయింట్లు, NSE నిఫ్టీ 170 పాయింట్లు కోల్పోయాయి. దీంతో సెన్సెక్స్ 65,800, నిప్టీ 19,500 పాయింట్ల ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే ఆసియా మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్న వేళ దేశీయ మార్కెట్లు కూడా దిగువకు జారుకున్నాయి. ఇక అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ మరింత క్షీణించింది. 7 పైసలు తగ్గి 81.95 వద్దకు చేరుకుంది.
U.S. ఉద్యోగాల డేటా, ప్రధాన కంపెనీల ఆదాయ నివేదికల కంటే ముందుగా S&P 500, Nasdaq బలహీనంగా ముగిశాయని ఈ మార్కెట్ల ప్రభావం ఇండియాపై చూపిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ 50లో ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, కోల్ ఇండియా, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ టాప్ గెయినర్లు కాగా, టాటా స్టీల్, హిందాల్కో, హీరో మోటోకార్ప్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ లైఫ్ సంస్థల స్టాక్స్ నష్టపోయాయి.