ఈ రోజుల్లో చాలా మంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం చాలా వెర్రి వేషాలు వేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఓ యువకుడు బస్సుపై కాలుపెట్టి విన్యాయాలు చేయడానికి ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల కాగా... ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్(Sajjanar) స్పందించారు.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే.. సోసల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండి. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని సజ్జనార్(Sajjanar) ట్విట్టర్లో హెచ్చరించారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను సజ్జనార్ షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువకుడు(young man) స్కూటీపై వెళుతూ తన ముందు ప్రయాణిస్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుపై ఒక కాలు పెట్టి డ్రైవింగ్ చేస్తున్నాడు. దీంతో వైరల్ గా మారింది.
ఆర్టీసీ బస్సులను అడ్డుపెట్టుకుని ఫీట్లు చేసే యువకులపై చర్యలు తీసుకుంటామని సజ్జనార్ ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేశారు. ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ ‘‘ఇలాంటి ఘటనలు టీఎస్ఆర్టీసీ(TSRTC) యాజమాన్యం ఉపేక్షించదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది. అంటూ ట్వీట్ చేశారు.
అలాగే వెర్రి వేయి విధాలు అంటే ఇదే.. అంటూ పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లిదండ్రులకు(parents) శోకాన్ని మిగల్చకండి’’.. అంటూ మరో ట్వీట్ చేశారు. మరి విచక్షణరహితంగా వ్యవహరించిన వ్యక్తిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
ఇలాంటి ఘటనలను #TSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.