Prahlad Modi : ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా.. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ఆస్పత్రి పాలయ్యారు. ఆయన గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. కాగా.. అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆయనను.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.
గతేడాది డిసెంబర్ నెలలో మైసూరులో ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో వీరిని నగరంలోని జేఎస్ఎస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీకి ఐదుగురు తోబుట్టువులు ఉండగా.. అందులో ప్రహ్లాద్ నాలుగో వ్యక్తి. ప్రస్తుతం ప్రహ్లాద్ అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అదే నగరంలో ఆయనకు టైర్ షో రూమ్‌ను కూడా ఉంది.