VZM: మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద వాగులో ఏలూరు ఆశ్రమ్ కళాశాల మెడికల్ విద్యార్థులు ముగ్గురు ఆదివారం గల్లంతైన విషయం తెలిసిందే. ఇద్దరి మృతదేహాలు సోమవారం ఉదయం బయటపడ్డాయి. వాటర్ ఫాల్స్ దిగువన ఇద్దరి యువతుల మృతదేహాలు దొరికాయి. వీరిలో బొబ్బిలికి చెందిన కె.సౌమ్య ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
MNCL: గోదావరిఖని శివారులోని గోదావరి నదిలో ఆదివారం గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గోదావరిఖని రెండో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం..మంచిర్యాలలోని చున్నంబట్టికి చెందిన వెంకటేశ్‌గా గుర్తించారు. కాగా జూలైలో ఇతను అత్తను హత్య చేసి, ఇటీవల జైలుకి వెళ్లాడు. బెయిల్‌పై విడుదలైన వెంకటేశ్ గోదావరిఖని సమీపంలోని గోదావరి నదిలో శమమై కనిపించాడు.
WG: నరసాపురంలో గంజాయి రవాణా చేస్తూ ముగ్గురు దొరికారు. అరుంధతీపేటకు చెందిన సిర్రా పెద్దిక్, కప్పల సందీప్, బొల్లం మణిచంద్రమౌళిల గంజాయి తీసుకు వస్తూ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని సీఐ యాదగిరి కోర్టులో హాజరుపరిచారు. ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. 1.930 కిలోల గంజాయి పట్టుబడగా.. దీని విలువ రూ.39 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
AP: అల్లూరి జిల్లాలో జలపాతంలో గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని అమృత, సౌమ్యలుగా గుర్తించారు. గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, నిన్న ఒక్కసారిగా వర్షం కురవడంతో జలపాతంలో నీరు ఉద్ధృతంగా ప్రవహించి ఐదుగురు కొట్టుకుపోయారు. స్థానికులు ఇద్దరిని కాపాడగా.. మిగిలిన ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే.
అమెరికాలో తుపాకీ సంస్కృతి నానాటికి పెరిగిపోతుంది. అక్కడ మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. అలబామా రాష్ట్రం బిర్మింగ్‌హమ్‌లోని ఓ బార్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఓ మహిళ సహా నలుగురు చనిపోయారు. మరో 18 మంది గాయాలపాలయ్యారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
VZM: కొత్తవలస మండలం కాంటకాపల్లి వద్ద శారదమెటల్స్ పరిశ్రమయార్డ్ లోని బొగ్గులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది.ఒడిశాలోని లారీలో దిగుమతి చేసుకున్న స్టీమ్డ్ కోల్ బొగ్గుయార్డ్ ఆన్‌లోడ్ చేశాక మృతదేహం గుర్తించినట్లు కంపెనీ హెచ్.అర్.హెచ్.సన్యాసిరావు పోలీసులకుసమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ మేరకు సీఐ షణ్ముఖరావు యార్డ్‌ను పరిశీలించారు. మృతుడు 35-40 మధ్య వయస్సు ఉంటుందని పేర్కొన్నారు.
NLR: జిల్లా వెంకటాచలం టోల్ ప్లాజా సమీపంలో సోమవారం ఉదయం క్యాంపర్‌ను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న క్యాంపర్ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొంది. దీంతో క్యాంపర్లోని ఒకరు చనిపోయారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: పొదిలిలో మతిస్థిమితం లేని ఓ మహిళను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళను వైద్య పరీక్షల కోసం ఒంగోలుకు తరలించారు. మహిళ అత్యాచారానికి గురైనట్లుగా వైద్యులు నిర్ధారించడంతో ఆదివారం పోలీసులు మతిస్థిమితం లేని మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన యువకుడిపై పోలీసుల కేసు నమోదు చేశారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని టెంబి పంచాయతీ పరిధిలో గల చిన్నమీయ తాండ గ్రామంలో దంగర్ రాజు తన పంట చేలలో సాగు చేస్తున్న 60 గంజాయి మొక్కలను పట్టుకున్నామని ఎస్సై అప్పారావ్ తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దంగర్ రాజుపై కేసు నమోదు చేసుకుని, రిమాండ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.
VZM: గుర్ల మండలం చోడవరం గ్రామంలో నక్కచిన్నయ్య అనే రైతుకు సంబంధించిన 25 గొర్రె పిల్లలు ఆదివారం కుక్కల దాడిలో మృతి చెందాయి. గొర్రె పిల్లల మృతితో తీవ్ర నష్టం జరిగిందని గొర్రెలపెంపకమే తమ జీవనోపాధని ఇప్పుడు మా పరిస్థితి ఏంటని రైతు వాపోతున్నాడు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని, ఇలాంటి పరిస్థితి ఇంకెవరికి రాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవల అధిక పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి తమిళనాడులో వెలుగుచూసింది. ఉద్యోగంలో పని ఒత్తిడికి మరో ఉద్యోగి బలయ్యాడు. 15 ఏళ్లుగా సాఫ్ట్‌వేర్ పని చేస్తున్న అతను ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి కరెంట్ షాక్ పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 2 నెలల నుంచి పని ఒత్తిడికి గురైన అతను.. సంబంధిత వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్న...
ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ఘటనలో గాయపడిన వారిని అంబులెన్స్, హెలికాప్టర్ల సాయంతో ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకావాలంటూ విచారణకు ఆదేశాలు జారీ ...
రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. అల్వార్ జిల్లా రాజ్‌ఘర్‌లో ఓ మత ప్రబోధకుడు ఏకంగా ప్రార్థనా స్థలంలోనే ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి తెలపడంతో.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆ కీచకుడిని అరెస్టు చేశారు. తన ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని ఆ నిందితుడు పిలిచాడు. అనంతరం ఆ బాలికను ప్రార్థనా స్థలంలోకి తీసుకెళ్లి బలాత్కారం చే...
రాజస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆజ్మీర్ జిల్లాలో ఓ భవన నిర్మాణంపై ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఓ భవన నిర్మాణ విషయంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు కర్రలు, రాడ్లతో దాడి చేసుకోవడంతో పాటు కాల్పులు జరుపుకున్నారు. దీంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హింసకు పాల్పడిన వారి కోసం గాల...
PLD: పిడుగురాళ్లలోని ఆంధ్ర బ్యాంకు సెంటర్‌లో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. సోడాలు వ్యాపారి ఏవూరి సత్యనారాయణ వ్యాపారాన్ని పూర్తిచేసుకుని ఇంటికి వెళుతున్నాడు. రోడ్డు దాటే సమయంలో అటుగా వస్తున్న బైకు బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి ఎస్ఐ మోహన్‌రావు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.