Pushpa 2: సెట్లో ఎన్టీఆర్.. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది!
సోషల్ మీడియాలో బన్నీ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య జరిగే.. కన్వర్జేషన్ భలే ఫన్నీగా ఉంటది. ఇద్దరు బావ, బావ అంటూ సరదాగా చాట్ చేస్తుంటారు. బన్నీ బర్త్ డ సందర్భంగా.. పార్టీ లేదా పుష్ప? అని అడిగాడు ఎన్టీఆర్. ఇది చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అలాంటిది ఇద్దరు నిజంగానే కలిస్తే మామూలుగా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తట్టుకోవడం కష్టమే. ఇప్పుడే జరిగిందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30(NTR 30) షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు యంగ్ టైగర్. అల్లు అర్జున్(allu arjun) పుష్ప2తో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలో బన్నీ, తారక్ ఇద్దరు కలుస్తారా? అనేది గత కొద్ది రోజులుగా క్రేజీగా మారింది.
ఇక ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పుష్ప2(Pushpa 2) సెట్(set)లో సందడి చేశారనే న్యూస్ విని.. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. అది కూడా జస్ట్ blurred ఫోటో చూసి మెంటల్ ఎక్కిపోతున్నారు. షూటింగ్ గ్యాప్‌లో సరదాగా పుష్పరాజ్ దగ్గరికి వచ్చాడట ఎన్టీఆర్. అల్లు అర్జున్, సుకుమార్‌లతో కాసేపు ముచ్చటించాడట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అయితే ప్రజెంట్ పుష్ప2(Pushpa 2) షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారనేది ఇండస్ట్రీ టాక్. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ పుష్ప సెట్స్‌కి వెళ్లడం ఏంటి? అనే డౌట్స్ వస్తున్నాయి. లేదంటే పుష్ప2 షూటింగ్ జరుగుతోందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాని నెట్టింట్లో మాత్రం ఎన్టీఆర్, పుష్ప సెట్‌ను విజిట్ చేశాడనే న్యూస్ చూసి.. ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు.
ఈ ఇద్దరు కలిసిన ఒక్క ఫోటో బయటికొస్తే చాలు.. సోషల్ మీడియా హోరెత్తి పోవడం ఖాయం. ప్రస్తుతం అంతలా రచ్చ చేస్తున్నారు బన్నీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఏదేమైనా ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్(fans) మాత్రం.. ప్రస్తుతం ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు.