»Liquor Tenders Are The Target Of Robbery Of 2000 Crores In Telangana Congress Leaders Ask To Brs Government
Liquor tenders: రూ.2 వేల కోట్ల కోసమే మద్యం టెండర్లు..మళ్లీ కొత్తవి కూడా!
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీయే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం(brs government) వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ముందస్తుగా మద్యం టెండర్లను ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో టెండర్లు పిలిచి ముందుగానే 2 వేల కోట్ల రూపాయలు దోచుకోవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తుందని అంటున్నారు.
తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో BRS ప్రభుత్వం(brs government) మరింత దిగజారుతుందని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దోపిడీనే లక్ష్యంగా ముందస్తుగా మూడు నెలులు ముందే ప్రీ-లిక్కర్ టెండర్లను ఆహ్వానించారని గుర్తు చేశారు. నవంబర్‌లో జరగాల్సిన మద్యం లైసెన్సుల నోటిఫికేషన్, టెండర్ల స్వీకరణ మూడు నెలల ముందే ఎందుకు ప్రకటించారని నేతలు అడుగుతున్నారు. అంతేకాదు ఈసారి మాత్రమే కొత్త లిక్కర్ పాలసీని ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు ఇప్పటికే తెలంగాణలో విచ్చలవిడిగా మద్యం షాపులు ఉన్నాయంటే మళ్లీ ఈ ఏడాది మరో 786 కొత్తగా వస్తున్నట్లు వెల్లడించారు. అసలు ప్రజల పాలన కోసం పనులు చేయాల్సింది పోయి..ప్రభుత్వం దోపిడీయే లక్ష్యంగా పనులు చేపడుతుందని ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొత్తగా మంజూరైన మద్యం లైసెన్స్‌లు(Liquor tenders) రెండేళ్లపాటు చెల్లుబాటు అవుతాయి. డిసెంబర్ 4 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్న ప్రభుత్వం లాటరీ విధానంలో కేటాయించిన మద్యం షాపు లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించాలి. మొత్తం 2,620 మద్యం దుకాణాలకు లాటరీ విధానంలో లైసెన్సులు మంజూరు చేయనున్నారు. మరో 786 మద్యం షాపులను రిజర్వేషన్ ద్వారా కేటాయిస్తారు. ఇక జనాభాను బట్టి మద్యం షాపు లైసెన్సుకు ఏడాదికి ఎంత చెల్లించాల్సి ఉంటుందో ప్రభుత్వం ప్రకటించింది. 5 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.1.1 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ముందస్తుగా మద్యం షాపుల లైసెన్సుల ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణలో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం(income) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈసారి మూడు నెలల ముందుగానే మద్యం లైసెన్సుల కేటాయింపు ప్రక్రియను ప్రారంభించారు. అలాగే ఈసారి కొత్త మద్యం పాలసీని కూడా ప్రవేశపెడుతున్నారు. ఈసారి ఇచ్చిన మద్యం లైసెన్సులు డిసెంబర్ 1, 2023 నుంచి నవంబర్ 30, 2025 వరకు చెల్లుబాటు అవుతాయి. ముఖ్యంగా నవంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆగస్టులోనే మద్యం లైసెన్స్‌ల ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 4 నుంచి 21వ తేదీలోపు మద్యం దుకాణదారులను ఎంపిక చేయనున్నారు. జనాభా ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయించిన లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి కొత్తగా లైసెన్స్ పొందిన వారు మద్యం విక్రయించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపులను లాటరీ విధానంలో కేటాయించనున్నారు. రిజర్వేషన్ ప్రకారం మరో 786 షాపులను కేటాయించనున్నారు. ఆగస్టు 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఈ నెల 18తో గడువు ముగుస్తుంది. మద్యం షాపుల ఎంపికకు 21న డ్రా తీయనున్నారు. 21, 22 తేదీల్లో మొదటి విడత ఎక్సైజ్ పన్ను చెల్లించాలి. నవంబర్ 30వ తేదీన అన్ని దుకాణాలకు సరుకులు సరఫరా చేయబడతాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం విక్రయాలు ప్రారంభం కానున్నాయి.