»Karnataka Man Booked Ola Cab Got Message From Yamraj Started Sweating After Seeing It Took Action Instagram Reel Post Viral
Ola Cab : ఓలా క్యాబ్ బుక్ చేస్తే ‘యమరాజ్’ నుంచి మేసేజ్.. కంగారు పడ్డ ప్యాసింజర్
ఇటీవల కాలంలో దాదాపు ప్రతి వ్యక్తి ఓలా, ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. మన సౌలభ్యం ప్రకారం క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు... క్యాన్సిల్ చేసుకోవచ్చు.
Ola Cab : ఇటీవల కాలంలో దాదాపు ప్రతి వ్యక్తి ఓలా, ఉబర్ వంటి ఆన్లైన్ క్యాబ్‌లను ఉపయోగిస్తున్నారు. మన సౌలభ్యం ప్రకారం క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు… క్యాన్సిల్ చేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు క్యాబ్‌ని క్యాన్సిల్ చేస్తాం. అయితే కర్ణాటకలో ఓ వ్యక్తికి క్యాబ్ అవసరం. బుకింగ్ అయ్యాక క్యాబ్ వచ్చింది. అయితే డ్రైవర్ పేరు, వచ్చిన మెసేజ్ చూసిన తర్వాత అతను క్యాబ్ ను క్యాన్సిల్ చేశాడు. ఎందుకో తెలుసుకుందాం.
కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ఓలాలో క్యాబ్ బుక్ చేశాడు. ఆ తర్వాత క్యాబ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. క్యాబ్ డ్రైవర్ ఇంటికి చేరుకోగానే ఆ వ్యక్తి మొబైల్‌కి మెసేజ్ వచ్చింది. మెసేజ్ చూసిన తర్వాత ఆ వ్యక్తికి చెమటలు పట్టాయి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా క్యాబ్ క్యాన్సిల్ చేశాడు. దానికి కారణం డ్రైవర్ పేరు. డ్రైవర్ పేరు ‘యమరాజ్’. యమరాజ్ పేరు చూడగానే ఆ వ్యక్తి మొహంలో చెమటలు పట్టాయి. అతని శరీరంలో వణుకు మొదలైంది. యమరాజ్ మెసేజ్ నిజంగానే వచ్చినట్లే. డ్రైవర్ కూడా అతనికి ఫోన్ చేశాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి అతనితో వెళ్లేందుకు సున్నితంగా నిరాకరించాడు.
మొబైల్లో క్యాబ్ మెసేజ్ ఇలా ఉంది… యమరాజ్ మీ లొకేషన్ కి వచ్చాడు. మీ కోసం వేచి ఉన్నను. అందులో ఉన్న కారు నంబర్- KA07A5045. ఆ వ్యక్తి దాన్ని స్క్రీన్ షాట్ తీశాడు. తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. ఈ పోస్ట్ జూన్ 17న Instagramలో Timepass Struggler (@timepassstruggler) పేరుతో ఉన్న ఖాతా నుండి షేర్ చేశారు. యమ్‌రాజ్ వచ్చాడు..నరకానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఈ పోస్ట్ శీర్షిక. కొద్దిసేపటికే ఈ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ పోస్ట్‌ను 3 కోట్ల 90 లక్షల కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. ఏడున్నర లక్షల మందికి పైగా వినియోగదారులు దీన్ని లైక్ చేసారు. లక్షల మంది యూజర్లు ఈ పోస్ట్‌ను షేర్ చేశారు.