స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు (Skill Developement scam case)లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)కు ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు సెప్టెంబర్ 22వ తేది వరకూ రిమాండ్ విధించారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు అధికారులు తరలించనున్నారు. బాబు అరెస్ట్ నేపథ్యంలో ప్రజలను దృష్టిలో ఉంచుకుని రేపు ఏపీవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.
ఏపీ (Andhrapradesh)లోని అన్ని జిల్లాల ఎస్పీలకు 144 సెక్షన్ (144 section)కు సంబంధించి ఉత్తర్వులు విడుదల అయ్యాయి. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా రేపు రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా బంద్కు పిలుపునిస్తున్నామని వెల్లడించారు.